కలం, వెబ్ డెస్క్: వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ప్రసిద్ధ సంకీర్తన ‘బ్రహ్మం ఒక్కటే’ స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ సంగీత వేదికపై మార్మోగింది. గ్రామీ అవార్డు గెలుచుకున్న అమెరికన్ అకాపెల్లా గాయకుల బృందం ‘చాంటిక్లియర్’ కీర్తను ఆలపించారు. ఈ ప్రదర్శనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (CM Chandrababu) హర్షం వ్యక్తం చేశారు.
చాంటిక్లియర్ బృందం అన్నమయ్య కీర్తనను అద్భుతంగా ప్రదర్శించిందంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు (CM Chandrababu) ప్రశంసలు కురిపించారు. సమానత్వం, మానవత్వం, సర్వజీవుల ఏకత్వం వంటి ప్రగాఢ సందేశాన్ని అందిస్తున్న ఈ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుందన్నారు. సరిహద్దులు, భాషలు, తరాలకు అతీతమైన తెలుగు సంస్కృతి, వారసత్వపు వైభవాన్ని ఈ ప్రదర్శన చాటి చెప్పిందన్నారు.

