రాష్ట్రస్థాయి పోటీలకు విజయ్ హైస్కూల్ విద్యార్థుల ఎంపిక

కలం, నిజామాబాద్ బ్యూరో: జన విజ్ఞాన వేదిక(Jana Vignana Vedika) ఆధ్వర్యంలో నిజామాబాద్ కాకతీయ పాఠశాలలో జిల్లా లెవెల్ సైన్స్ టెస్ట్ ను నిర్వహించారు. అనంతరం పిల్లలకు సర్టిఫికెట్ లను ప్రధానం చేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను కూడా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెరుకూరి కాకతీయ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రామోజీరావు సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతి, చెలిమల రాజేశ్వర్, బాస రాజేశ్వర్, శ్రీహరి ఆచార్య, రవీంద్రనాథ్ సూరి, సృజిల్ బాబు హాజరయ్యారు.

రాష్ట్ర స్థాయికి విజయ్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు పులి జైపాల్, అధ్యక్షులు సక్కి ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బంటు అజయ్, కోశాధికారి పండరి, చెకుముకి కన్వీనర్ మల్లని శివ, ఉమర్ అలీ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>