ఉపాధి పనులపై సామాజిక తనిఖీ.. నిధుల ఖర్చుపై ఆరా

కలం యాదగిరిగుట్ట: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల లెక్కలపై సామాజిక తనిఖీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట(Yadagirigutta) మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించి, ఏడాది కాలంలో జరిగిన పనులు, వాటికి వెచ్చించిన నిధుల వివరాలను పరిశీలించారు.

2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు మండల పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించి వేతనాల రూపంలో రూ.3.90 కోట్లు, మెటీరియల్ ఖర్చుల కింద రూ.1.60 కోట్లు వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా సుమారు రూ.5.49 కోట్ల నిధుల వినియోగంపై సామాజిక తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత, పనుల అమలులో జవాబుదారీతనం ఉండేలా సామాజిక తనిఖీ ప్రజావేదికలు కీలకంగా నిలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరిగిన పనులు, కూలీలకు చెల్లించిన వేతనాలు, మెటీరియల్ వ్యయం వంటి అంశాలను పరిశీలించడం ద్వారా పథకం అమలులో వాస్తవ పరిస్థితులను సమీక్షించే అవకాశం కలుగుతుంది.

ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి నవీన్ కుమార్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా, జిల్లా విజిలెన్స్ అధికారి మందాడి ఉపేందర్ రెడ్డి, ఎంపీడీవో నవీన్ కుమార్, అసిస్టెంట్ విజిలెన్స్ మేనేజర్ ఆదిత్య వర్ధన్, క్యూసీ రాజావర్ధన్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఓ లింగపల్లి నర్సయ్య, ఈసీ రాజశేఖర్, ఎస్ఆర్పీ రమేష్ బాబు, ఏఈ/పీఆర్ పూర్ణ చంద్రరావుతో పాటు పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బీఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, వీఆర్పీలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>