ర్యాప్‌ సాంగ్ వివాదం.. స్పందించిన క్రియేట‌ర్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: సోష‌ల్ మీడియాలో కొద్ది రోజులుగా వైర‌ల్‌గా మారిన వివాదాస్ప‌ద సాంగ్ ‘గెలికి చూడు తమ్ముడు’కు ఎండ్ కార్డ్ ప‌డింది. ఈ సాంగ్ బాగా వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు, ప్ర‌ముఖ రాజ‌కీయ నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హింస‌ను ప్రేరేపించేలా ఉన్న ఈ సాంగ్‌ను సోష‌ల్ మీడియా నుంచి తొల‌గించి, దీన్ని క్రియేట్ చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ సాంగ్ విన‌డానికి, చూడ‌డానికి చాలా ఇబ్బందిక‌రంగా ఉంద‌ని, హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో హ‌త్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇలాంటి పాటలు ఫేమ‌స్ అయితే మ‌రింత ప్ర‌మాదం అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇక సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు, రాజ‌కీయ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో ఈ సాంగ్ క్రియేట‌ర్ దాస‌రి స‌హాజ్‌ (Dasari Sahaj) స్పందించాడు. త‌న గెలికి చూడు త‌మ్ముడు అనే సాంగ్ చాలా వైర‌ల్ అయింద‌ని, ఇది ఎవ‌రినీ ఉద్దేశించి తీసిన పాట కాద‌ని స్ప‌ష్టం చేశాడు. కేవలం యాక్టింగ్ చేస్తూ తీసిన పాట‌ని క్లారిటీ ఇచ్చాడు. ఈ సాంగ్ స‌మాజానికి ఇబ్బందిగా ఉంది కాబ‌ట్టి త‌న సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఎవ‌రూ ఈ పాట‌ను త‌ప్పుగా వినియోగించుకోవ‌ద్ద‌ని కోరాడు. సహాజ్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పాట తొల‌గించినా ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ప‌లు చోట్ల అందుబాటులో ఉంది. ఈ నేప‌థ్యంలో పోలీసులు అత‌డిపై ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాలి.

Also Read : అండాల అక్రమ వ్యాపారం: కీలక వివరాలు వెల్లడించిన సీపీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>