అభివృద్ధి బాటలో కేటీ దొడ్డి.. ఎమ్మెల్యే బండ్ల కీలక అడుగు!

కలం, జోగులాంబ గద్వాల: కేటీ దొడ్డి (KT Doddi) మండలంలోని కేటీ దొడ్డి, నందిన్నె, కుచినెర్ల, గువ్వలదిన్నె గ్రామాల్లో రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) భూమిపూజ చేశారు. కేటీ దొడ్డి, నందిన్నె, కుచినెర్లలో రూ.30 లక్షల చొప్పున, గువ్వలదిన్నెలో రూ.25 లక్షలతో వ్యవసాయ గోదాముల నిర్మాణానికి భూమిపూజ చేశారు. నందిన్నెలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి, కుచినెర్ల ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద రూ.48 లక్షలతో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ గది, గ్రంథాలయం, వర్క్‌షెడ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోదాముల నిర్మాణంతో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వీలవుతుందన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, నందిన్నె ప్రకాష్ రావు, వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ‌ చైర్మన్‌ కుర్వ హనుమంతు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచ్‌లు నారాయణ, ఆంజనేయులు, కృష్ణ, నాగమ్మ వెంకటేష్, పవన్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు ఉరుకుందు, మైలగడ్డ చంద్రశేఖర్, శేఖర్ రెడ్డి, యుగేందర్ గౌడ్, వెంకన్న గౌడ్, గోపాల్ రెడ్డి, రంగారెడ్డి, వెంకట కిషన్ రావు, హరి ప్రసాద్ గౌడ్, వెంకటేష్ గౌడ్ భగవంతు, మల్లేష్ గౌడ్, తిక్కన్న, మల్లికార్జున్, మహాదేవుడు, తాయిప్ప రెడ్డి, నాసిర్, వీరేష్, నారాయణరెడ్డి, మహాదేవుడు, నాగేష్, జంగిలప్ప, వీరేష్, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>