పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు ‘ఫిట్ కాప్’ యాప్.. ప్రత్యేక శిక్షణ

​కలం, ఖమ్మం బ్యూరో: విధి నిర్వహణలో నిరంతరం పని ఒత్తిడి, అధిక పనిభారం ఎదుర్కొనే పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ‘ఫిట్ కాప్’ యాప్(Fit Cop App) ఉపయోగపడనుంది. ఈ యాప్ వినియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇతర సంస్థల సహకారంతో రూపొందించిన ఈ యాప్ ద్వారా పోలీసుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించనున్నారు. శిక్షణలో భాగంగా వ్యక్తిగత ఆరోగ్య వివరాల నమోదు, శారీరక పరీక్షల రీడింగ్స్ సేకరణ, వాటిని యాప్‌లో అప్‌లోడ్ చేసే విధానాన్ని వివరించారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, బీఎంఐ, జీవనశైలి అలవాట్లు, రోజువారీ వ్యాయామ వివరాలను నమోదు చేసి పర్యవేక్షించే విధానంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి మాట్లాడుతూ.. యాప్ ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, సకాలంలో వైద్య సలహాలు, చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బంది తమ పోలీస్ స్టేషన్లలోని ఇతరులకు కూడా యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రాము, రమాకాంత్, ఇంద్రసేనారెడ్డి, నాగబాబు, ఎల్లయ్య, కరుణాకర్, సురేష్, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నరసింహారావు, లాల్ బాబు, కృష్ణారావు, ఇతర పోలీస్ అధికారులు, టెక్ టీం, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>