కలం, వెబ్ డెస్క్ : మహిళల అండాలను అక్రమంగా సేకరించి వ్యాపారం చేస్తున్న వ్యవహారంలో సరూర్‌నగర్ పోలీసులు మరో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. సద్గురు హెల్త్‌కేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రతిక్ అనిల్ గగ్లానీ, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి (CP Sumathi) వెల్లడించారు.
ఓయాసిస్ ఫెర్టిలిటీ సంస్థకు చెందిన ఈ ఇద్దరు అధికారులు దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో అండాల సేకరణ నెట్వర్క్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలకు హార్మోన్ మందులు, ఇంజెక్షన్లు ఇచ్చి అక్రమంగా అండాలను సేకరిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ దందా ద్వారా వీరికి నెలకు సుమారు రూ.28 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2026 ఏప్రిల్ నుంచి నవంబర్ 26 వరకు ఏకంగా రూ.487.82 కోట్ల మేర బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి మూడు ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని మల్కాజిగిరి సీపీ సుమతి (CP Sumathi) పేర్కొన్నారు.
Also Read : కేటీఆర్ కీలక ప్రకటన.. బీఆర్ఎస్ మద్దతు!
Follow Us On : WhatsApp

