హన్మకొండలో ఎమ్మెల్యే అనుచరుడి హల్‌చల్..

కలం, వెబ్‌ డెస్క్‌ : విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ ఇంటికి వచ్చిన విద్యుత్ సిబ్బందిపై కాంగ్రెస్ నాయకుడు (Congress Leader), ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు ఇస్మాయిల్ దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగిన ఘటన హన్మకొండలో కలకలం రేపింది. సుబేదారి పరిధిలోని అలిపురలో నివాసముంటున్న ఇస్మాయిల్ వద్ద విద్యుత్ బకాయిల వసూలుకు అధికారులు వెళ్లగా, బిల్లు చెల్లించేది లేదని, తన ఇంటి విద్యుత్ సరఫరా నిలిపివేసి చూపించాలని సవాల్ చేసినట్లు సమాచారం.

ఎమ్మెల్యే పేరు ప్రస్తావిస్తూ అధికారులను దూషించడమే కాకుండా, విద్యుత్ శాఖ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దాడికి దిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇస్మాయిల్ ఇంటికి రూ.28 వేలు, వేయి స్తంభాల గుడి సమీపంలోని యూనికాన్ కూలర్స్ షాపునకు రూ.80 వేలు, మడికొండలోని యూనికాన్ ఇండస్ట్రీకి రూ.2.50 లక్షలు కలిపి మొత్తం రూ.3.58 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>