కలం, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వద్ద NH-161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Medak Accident) జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బ్రిడ్జిపై ఉన్న డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

