మున్సిపల్ ఎన్నికల వేళ శ్రీకాళహస్తిలో దాడి కలకలం

కలం, వెబ్‌ డెస్క్‌ : శ్రీకాళహస్తిలో (Srikalahasti) మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాండురంగపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. కూటమి నేతలు పథకం ప్రకారం రాజీవ్ నగర్ వద్ద కారుతో ఢీకొట్టి ఆయనను హతమార్చేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ఈ ఘటనలో పాండురంగ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడికి చేరుకుని గాయపడిన పాండురంగను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ దాడిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>