కార్మికుడి మృతికి కారణమైన పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి: కొంగళి శ్రీకాంత్

కలం, జడ్చర్ల: పోలేపల్లి సెజ్‌లోని సుప్రీం ఇండస్ట్రీస్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ఓ కార్మికుడు మృతికి కారణమైన ఆ పరిశ్రమ అనుమతులను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు న్యాయవాది కొంగలీ శ్రీకాంత్(Kongali Srikanth) డిమాండ్ చేశారు. శనివారం జడ్చర్లలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సకాలంలో అంబులెన్స్ అందక మాచారం గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు చందు(35) మృతి చెందడం దారుణమని ఆయన తెలిపారు. ఈ సంఘటన ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ ఘటనపై సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఫ్యాక్టరీస్ & లేబర్ శాఖలకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తక్షణమే పరిశ్రమలోని సీసీ టీవీ ఫుటేజ్, అంబులెన్స్ రికార్డులను సీజ్ చేసి విచారణ జరిపించాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పరిశ్రమ సెజ్ అనుమతిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి నష్టపరిహారం, ఎక్స్-గ్రేషియా చెల్లించే వరకు అండగా ఉండి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>