బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: డీ లిమిటేషన్ బిల్లు (Delimitation Bill)ను పార్లమెంటులో ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో బీజేపీ హై కమాండ్ మరింత అప్రమత్తమైంది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రతి ఎంపీ రేపు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో విప్‌ల సమావేశం జరగబోతుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు.

అన్ని పార్టీల మద్దతు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. మెజార్టీ పార్టీలను తనవైపు తిప్పుకోగలిగింది. సొంత పార్టీ ఎంపీలు కూడా బిల్లు ఓటింగ్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు చేపట్టింది. ఇదిలా ఉంటే, ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగనుంది. దీనికి ప్రధాని మోదీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హాజరు కాబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>