బీఎం.సందీప్ ను కలిసిన మహబూబ్ నగర్ డీసీసీ చీఫ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర నూతన ఏఐసీసీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన బీఎం.సందీప్ ను శుక్రవారం హైదరాబాదులోని గాంధీభవన్ లో మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏ.సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర ఇన్-చార్జ్ మార్గదర్శకత్వంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తానని సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>