ఖేలో ఇండియా పోటీల‌కు ప‌టిష్ట‌ భ‌ద్ర‌త: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కబడ్డీ పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. శుక్రవారం మహబూబ్‌న‌గర్ స్టేడియం గ్రౌండ్‌లో కబడ్డీ పోటీల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. వివిధ రాష్ట్రాల నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చే క్రీడాకారులు, కోచ్‌లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, వసతి, రవాణా, భద్రత తదితర సౌకర్యాలను సమర్థవంతంగా కల్పించాలని సూచించారు.

క్రీడాకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం వహించరాదని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. క్రీడాకారులకు ఆతిథ్యం, సౌకర్యాల కల్పనలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న ఈ క్రీడలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, రాష్ట్రస్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటేలా విజయవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు ఉమర్ కొత్వాల్, అనుప ఆంజనేయులు, నాయకులు ఖాజా పాషా, నరేష్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజుల రెడ్డి, డీవైఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>