శాతవాహన పీజీ ఫలితాల్లో వాణినికేతన్ విద్యార్థుల ప్రతిభ

కలం, కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం (Satavahana University) పీజీ పరీక్షా ఫలితాల్లో వాణినికేతన్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి కళాశాలకు గర్వకారణంగా నిలిచారని కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ డా.తాడూరు వేంకటేశ్వర స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలకు చెందిన రామీసా ఉన్నిస 8.58 జిపిఏ, గుంటి అఖిల 8.37 జిపిఏ, గంధం నీలిమ 7.77 జిపిఏ, సిరిపురం మయూరి 7.42 జిపిఏ,ప్రవలిక 6.90 జిపిఏ సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దీపిక పీజీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి మార్గదర్శకత్వం వహించిన అధ్యాపకులను, సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కరస్పాండెంట్ దీపిక, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ వేంకటేశ్వర స్వామి, అడ్మిషన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సరోజ, అధ్యాపక బృందం అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>