కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి.. పోస్ట్‌కార్డుల ఉద్యమం

కలం, బాసర: బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ)లో కాంట్రాక్ట్ అధ్యాపకులు(Contract Lecturers) తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమంలో భాగంగా ఏడో రోజు శుక్రవారం పోస్ట్‌కార్డుల ఉద్యమాన్ని నిర్వహించారు. ఆర్జీయూకేటీ టీచింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ సర్వీసులోకి అబ్జార్ప్షన్ చేయాలని కోరారు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు 7వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను ముందుగా రెగ్యులర్ సర్వీసులోకి తీసుకున్న తర్వాతే రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏళ్లుగా సేవలందిస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, శ్రీశైలం, శ్రీకాంత్, చరణ్‌రెడ్డి, రమాదేవి, విజయ్‌కుమార్, శ్రీనివాస్, శేఖర్, తిలక్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నాగసాయి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>