పార్టీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా.. పోలీసులకు బీజేపీ నాయకుల ఫిర్యాదు

కలం, కరీంనగర్‌ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పేరుతో ఫేస్‌బుక్‌లో మోసపూరిత అనుకరణ (నకిలీ) ఖాతాను తెరిచి, నాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్న గుర్తు తెలియని వ్యక్తిపై చొప్పదండి బీజేపీ నాయకులు (Choppadandi BJP Leaders) పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నేడు ఈ-మెయిల్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు , కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంకి ఫిర్యాదు పంపారు.

ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ… ఒక గుర్తు తెలియని వ్యక్తి ‘కరీంనగర్ బీజేపీ’ పేరుతో ఫేస్‌బుక్‌లో మోసపూరిత అనుకరణ ఖాతాను సృష్టించి, వివిధ పార్టీల నాయకులపై తప్పుడు కామెంట్లు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పార్టీ పేరును దుర్వినియోగం చేయడమే కాకుండా, సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులను అసభ్యంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం దారుణమని అన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి సదరు నిందితుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చొప్పదండి రూరల్ మండల శాఖ అధ్యక్షులు మొగిలి మహేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల శంకర్, మండల ప్రధాన కార్యదర్శి కొమ్ము రమేష్, నాయకులు జక్కుల అంజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>