కలం, వెబ్ డెస్క్: రాజధాని అమరావతిలో రూ.380 కోట్లతో కొత్త అసెంబ్లీ నిర్మాణానికి ఏపీ కేబినెట్ (AP Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో రూ.180 కోట్లతో గ్రీన్ వర్క్స్, అమరావతిలో రూ.432 కోట్లతో హై కోర్టు నిర్మాణ పనులు, అమరావతి నిర్మాణ వ్యయం రూ.6,641 కోట్లు, సచివాలయ భవనాల పెంపునకు ఆమోదం తెలిపింది. చిన్న తరహా పరిశ్రమలకు రైట్ టు బిజినెస్ బిల్లు, పరిశ్రమలకు మరింత సులభతర విధానాలు అమలు చేయాలని నిర్ణయించింది.
శ్రీకాకుళంలో అదానీ టైటానియం కాంప్లెక్స్..
కోసలనగరం ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీ కేబినెట్ రూ.1,500 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూ కేటాయింపులు చేసింది. మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ కెమికల్ పార్క్‌కు ఆమోదం తెలిపింది. పెనుకొండ కియా ప్లాంట్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అచ్యుతాపురంలో సెయింట్ గోబెన్ గ్లాస్ ప్లాంట్, శ్రీకాకుళంలో అదానీ టైటానియం కాంప్లెక్స్, లేపాక్షిలో డిఫెన్స్ ఏరో స్పేస్ కేంద్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

