కలం, వెబ్ డెస్క్: వాట్సాప్ (WhatsApp) మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. విదేశాలకు ప్రయాణించేవారి కోసం ‘ఈ-సిమ్(eSIM)’ ఫీచర్‌ను ప్రారంభించబోతుంది. దీంతో ఇక నుంచి విదేశాలకు వెళ్లినప్పుడు నెంబర్ మార్చాల్సిన అవసరం లేకుండా, కొత్త సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే.. వాట్సాప్‌లోనే ‘ఈ-సిమ్’ ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు ఇంటర్నెట్ వినియోగించుకోవాలంటే ఒకటి, ఇప్పుడున్న సిమ్‌కు ఇంటర్నేషనల్ రోమింగ్ ఆన్ చేసుకోవడం.. రెండోది, ఆ దేశపు సిమ్ కొనుగోలు చేయడం.. మూడోది, ఇతర కంపెనీల నుంచి ట్రావెల్ సిమ్ కొనుక్కోవడం వంటి మూడు పద్ధతులు వాడుతుంటారు. అయితే వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్న ఈ-సిమ్‌తో ఇలాంటి ఇబ్బందులు ఉండవు.
ఈ-సిమ్ ఎలా పనిచేస్తుందంటే..
విదేశాలకు వెళ్లినప్పుడు వాట్సాప్ (WhatsApp) అకౌంట్ సెక్షన్లోకి వెళ్లి, ట్రావెల్ ఈ-సిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. అక్కడ మనం వెళ్లిన దేశాన్ని సెలెక్ట్ చేసుకోగానే.. ప్లాన్ల వివరాలు చూపిస్తుంటుంది. నచ్చిన ప్లాన్ సెలెక్ట్ చేసుకుని, పేమెంట్ చేస్తే ఈ-సిమ్ యాక్టివేట్ అయిపోతుంది. అక్కడ లోకల్ నెట్వర్క్ కనెక్ట్ కాగానే.. వాట్సాప్ ఈ-సిమ్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. దీని వలన అక్కడకు వెళ్లిన వెంటనే.. వేరే సిమ్ కోసం చూడాల్సిన అవసరం లేకుండానే.. వాట్సాప్ నెంబరుతోనే ఎప్పటిలాగనే కనెక్ట్ కావొచ్చు. అయితే వాట్సాప్ తెచ్చిన ఈ-సిమ్ ఫీచర్ డేటా కోసమే డిజైన్ చేశారు. దీనికి కొత్త నెంబర్ లేదా మరో వాట్సాప్ అకౌంట్ మాత్రం క్రియేట్ అవ్వదని.. కేవలం పాత నెంబరుతో పనిచేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే దీన్ని ఇండియాలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
Also Read : భారత్ సమ్మిట్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Follow Us On : WhatsApp

