‘మీరు సినిమా తీసుకోండి’.. సుప్రీం కోర్టు సీరియస్

కలం, వెబ్ డెస్క్: రామాయణ మూవీని థియేటర్లలో వెంటనే నిలిపేయాలని దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) సీరియస్ అయింది. అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “సినిమా ఇప్పటికే విడుదలైంది. ఎవరైతే చూడాలనుకున్నారో వారు చూసేశారు. ప్రేక్షకులకు ఎలా అర్థం అయ్యేది ఉంటే అలా అర్థమవుతుంది. కొందరు విమర్శిస్తారు.. కొందరు ప్రశంసిస్తారు. కావాలంటే మీరు సినిమా తీసుకోండి. అంతే తప్ప, కోర్టు సమయం వృథా చేయొద్దు. ఆ మూవీపై మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే.. కౌంటర్‌గా మీకు అనిపించినట్లుగా సినిమా లేదా డాక్యుమెంటరీ తీసుకోండి. మూవీ థియేటర్లలో విడులైంది కాబట్టి, అత్యవసరంగా విచారించాలంటే మాత్రం కుదరదు” అని అసహనం వ్యక్తం చేసింది.

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 5వ తేదీన విడుదలై.. భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ చిత్రంలో రామాయణంలోని పాత్రలను సరిగ్గా చూపించలేదంటూ ఒక లాయర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవాలను విస్మరించారని, కొత్త తరం వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని వాదించారు. దీన్ని విచారించిన సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసి.. పిటిషన్ కొట్టేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>