కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గొజ్జ జనార్ధన్, వైస్ చైర్మన్ ఎం.సి. లింగన్న, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు రాఘవులు, సభ్యులు అయ్యన్నగారి భూమయ్య, నాగభూషణం, రమేష్, ముజాహిద్, మన్సూర్, తదితరులు పాల్గొన్నారు.

