కలం, వెబ్‌డెస్క్: ఏపీలో 2025 సంవత్సరానికి నేషనల్ ఫిల్మ్ అవార్డుల (Film Awards) ఎంపిక కోసం ప్రభుత్వం జ్యూరీని నియమించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం జీవో జారీ చేసింది. నేషనల్ ఫిల్మ్ అవార్డుల ఎంపికకు సంబంధించి ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ జ్యూరీకి సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ను చైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా అల్లు అరవింద్, ఎస్.గోపాల్ రెడ్డి, ప్రభలను నియమించింది. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను సభ్యుడు, కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జ్యూరీ ఎంపిక ప్రక్రియకు అనుగుణంగా అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రానున్న డిసెంబర్లో ఈ అవార్డుల ప్రదానం జరుగనుంది.

