రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సాయిని మల్లేశం

కలం, కరీంనగర్: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత గ్రంథమని బీజేపీ కరీంనగర్(Karimnagar) జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

తొలుత స్థానిక విద్యుత్ ఎస్ఈ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం కోర్టు చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులంతా కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి వినిపించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాయిని మల్లేశం మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు దేశం ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. యువత రాజ్యాంగంపై పూర్తి అవగాహన పెంచుకొని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షలు గుర్రాల వెంకట్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, కన్నబోయిన ఓదెలు, కార్పొరేటర్లు సోమిడి వేణుప్రసాద్, నాంపల్లి శ్రీనివాస్,మాసం గణేష్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>