కలం, స్పోర్ట్స్: హార్దిక్ పాండ్యా ట్రేడ్ వెనుక మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians)నుంచి పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిన హార్దిక్‌ను తొలుత రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకోవాలని ప్రయత్నించినట్లు సమాచారం. ఇందుకోసం రాజస్థాన్ యాజమాన్యం, క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర బెంగళూరులో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ భారీ డిమాండ్ పెట్టినట్లు సమాచారం. రాజస్థాన్ నుంచి యశస్వి జైస్వాల్, జోఫ్రా ఆర్చర్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు కీలక ఆటగాళ్లను వదులుకునేందుకు రాజస్థాన్ అంగీకరించలేదు.
దీంతో ఈ ట్రేడ్ చర్చలు ముందుకు సాగలేదు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ ట్రేడ్‌లో లక్నో నుంచి మహమ్మద్ షమీ, మణిమారన్ సిద్ధార్థ్‌ను తీసుకుంది. వీరిద్దరి కోసం ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను వదులుకుంది. 145 వికెట్లతో ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉన్న షమీ.. జోఫ్రా ఆర్చర్‌తో కలిసి రాజస్థాన్ బౌలింగ్‌ను మరింత బలోపేతం చేయనున్నాడు. చివరకు హార్దిక్ ట్రేడ్ పంజాబ్ కింగ్స్‌తో పూర్తయింది. అర్ష్‌దీప్ సింగ్‌కు బదులుగా హార్దిక్ పాండ్యా పంజాబ్ జట్టులోకి వెళ్లాడు.

