కలం, వెబ్ డెస్క్: ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే కట్టడాలలో ఒకటైన తాజ్ మహల్ (Taj Mahal), కోతుల గుంపులకు విహార స్థలంగా మారుతోంది. దీంతో సందర్శకులతో సహా పర్యాటకుల భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో వానర సేన తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజ్ మహల్ (Taj Mahal) తూర్పు, పశ్చిమ, రాజ ద్వారాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కోతులు తిష్ట వేశాయి. దీంతో సందర్శకులు దాడుల ప్రమాదాన్ని ఎదుర్కునే అవకాశం ఉంది. గతంలో పర్యాటకులపై కోతులు దాడులకు పాల్పడిన ఘటనలు లేకపోలేదు. అయితే, కోతులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ, కోతుల సంఖ్య పెరగడం, సందర్శకుల భద్రతతో పాటు భారతదేశ వారసత్వానికి ప్రతీకగా నిలిచే ప్రధాన పర్యాటక కేంద్రం (Taj Mahal) ప్రతిష్టపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
📍Agra: Viral visuals from the Taj Mahal show troops of monkeys roaming the iconic monument, with tourists reportedly facing attacks
#TajMahal #monkey https://t.co/lrLFFiDAkF
— NDTV (@ndtv) November 26, 2026
Also Read : గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమ
Follow Us On : WhatsApp

