ఆగిన కారుపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : అనంతపురం (Anantapur Accident ) జిల్లా యాడికి మండలం రాయలచెరువు సమీపంలోని 67వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారుపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాద ధాటికి వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరైన కుటుంబం కారులో తాడిపత్రికి వస్తున్న వేళ ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన మిద్దె వీరాంజనేయులు రెడ్డి, మిద్దె హనుమంత్ రెడ్డి అలియాస్ చిన్నబాబు, మల్లికార్జున శెట్టి, సుహాసినిలు మృతి చెందారు. ఈ ఘటనలో వాహనంలో ఉన్న మరికొందరికి తీవ్ర గాయాలు కాగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>