కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం (Visakhapatnam Bus Accident) చోటుచేసుకుంది. విశాఖ నుంచి రాజోలు బయలుదేరిన ఆర్టీసీ బస్సు సత్యం జంక్షన్ నుంచి గురుద్వార్ వైపు వెళ్లే మార్గంలో ఒక్కసారిగా అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకెళ్లిన బస్సు రోడ్డుపై ఉన్న పలు వాహనాలను బలంగా ఢీకొట్టి, అనంతరం డివైడర్‌ను దాటుకుని కల్వర్టు లోపలికి దూసుకుపోయింది.
ఈ ప్రమాద ధాటికి రోడ్డుపై ఉన్న పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

