కలం, స్పోర్ట్స్: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. యూఏఈ బౌలర్లపై విరుచుకుపడి కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేశాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో 28 సిక్సర్లతో రికార్డుల మోత మోగించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో సెంచరీ, 40 బంతుల్లో 150 పరుగులు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ, డబుల్ సెంచరీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ నిలిచాడు.
గతంలో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 29 బంతుల్లో సెంచరీ చేయగా.. వైభవ్ 28 బంతుల్లోనే ఆ రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ 103 బంతుల్లో సాధించిన డబుల్ సెంచరీ రికార్డునూ అధిగమించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డార్సీ షార్ట్ పేరిట ఉన్న 23 సిక్సర్ల రికార్డును 28 సిక్సర్లతో తిరగరాశాడు. వైభవ్ విధ్వంసంతో భారత్ ఏ 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికే ఐపీఎల్‌లో 35 బంతుల్లో సెంచరీతో రికార్డు సృష్టించిన ఈ యువ ఆటగాడు.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటాడు.

