కుచారంలో మహిళా సాధికారతకు కొత్త వేదిక

కలం, మెదక్ : మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధిని లక్ష్యంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కుచారంలోని (Kucharam) COWE సంస్థలో ‘పౌష్టిక్ – ఫుడ్ ఇంక్యుబేషన్ సెంటర్’ ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు COWE India, SERP తెలంగాణ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కేంద్రాన్ని DRDO మెదక్ శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) జనరల్ మేనేజర్ వై. యాదగిరి, COWE India డైరెక్టర్ సుమన్ కుమార్, COWE India అధ్యక్షురాలు నీరజా రెడ్డి, తెలంగాణ COWE అధ్యక్షురాలు కల్పనా రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు, ముఖ్యంగా ఆహార శుద్ధి, ఆహార ఉత్పత్తుల తయారీ రంగాల్లో రాణించేందుకు ఇటువంటి ఇంక్యుబేషన్ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కేంద్రం కేవలం ఆహార ఉత్పత్తుల తయారీ కేంద్రంగానే కాకుండా, మహిళలు ఆహార రంగంలో వ్యాపారాలు ప్రారంభించడం, అభివృద్ధి చేసుకోవడం, తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్లలో విక్రయించేందుకు అవసరమైన సహకారం అందించే సమగ్ర వేదికగా పనిచేయనుంది. SERP తెలంగాణ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి, COWE India ద్వారా వారికి వ్యాపార అభివృద్ధి, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అనుసంధానం వంటి సేవలు అందించనున్నారు. తద్వారా మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>