జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర దాడికి భారీ కుట్ర

కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో భారీ స్థాయిలో ఉగ్ర దాడి చేసేందుకు కుట్రలు (Terror Attack Plot) చేస్తున్న వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీరట్ నగరానికి చెందిన ఉజైద్ ఖురేషి అనే యువకుడు పాకిస్థాన్ ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 14-18 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇలా ఒక బృందంగా తయారయ్యాక.. కశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఎయిర్‌బేస్‌లు టార్గెట్ చేసి వారిపై దాడులు చేసేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రూపొందించుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన షహజాద్ భట్టి అనే ఉగ్రవాది అసలైన మాస్టర్‌మైండ్ అని, ఇతను ఖురేషి లాంటి యువకులతో ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పక్కా ఆధారాలు సేకరించారు. కశ్మీర్‌లో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ నెట్‌వర్క్‌లో కీలకంగా పనిచేస్తున్నారు.

నీట్ ప్రిపేర్ అవుతూ..

జమ్మూకి చెందిన సాజిద్ అనే యువకుడు నీట్ పరీక్షకు (NEET Exam) ప్రిపేర్ అవుతున్న క్రమంలో పాక్ ఉగ్రవాదులకు దగ్గరయ్యాడు. భద్రతా బలగాలు ఇతడి ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. ఉజైద్ ఖురేషి పేరు బయటకొచ్చింది. మీరట్ చుట్టుపక్కల ప్రాంతాల గురించి ఖురేషి సాజిద్‌కు చెప్పేవాడని.. తద్వారా అక్కడే దాడులకు ప్లాన్ చేయాలనేది కూడా వీరి ప్లాన్‌గా స్పష్టమవుతోంది. ఖురేషి తరచూ మీరట్ నుంచి కశ్మీర్ వెళ్తుండటం కూడా అనుమానాలకు తావిచ్చింది. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన ఖురేషి.. అమ్మమ్మ ఇంటికి పారిపోగా, పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read : రాజీవ్ గాంధీ చనిపోవాలనే అలా చేశారు: రాహుల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>