గద్వాలలో కుక్కల స్వైర విహారం.. ప్రజల్లో భయాందోళన!

కలం,‌ జోగులాంబ గద్వాల: గద్వాల మున్సిపాలిటి (Gadwal Municipality) పరిధిలోని పలు వార్డులలో వీధి కుక్కల స్వైర విహారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పలు వార్డులు, రోడ్లమీద, పలు కాలనీల్లో గుంపులుగా సంచరిస్తూ చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వాహనదారుల వెంటపడుతున్నాయి. రాత్రి వేళల్లో రోడ్లపై నడిచేవారిపై దాడులకు దిగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

వీధి కుక్కల (Stray Dogs) సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు కుక్కలను పట్టుకోవడం మినహా శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. బర్త్‌ కంట్రోల్‌ కార్యక్రమాలు కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదని విమర్శిస్తున్నారు. కుక్కలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రించాలని కోరుతున్నారు.

తాజాగా మంగళవారం తెల్లవారుజామున చింతలపేటలో వీధి కుక్కలు ఇద్దరిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారులు బయట ఆడుకోవాలన్నా, వృద్ధులు నడకకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గద్వాల పట్టణం(Gadwal)లో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిందని బాధితుడు నర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ పలు కాలనీల్లో చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటనలు జరిగాయని తెలిపారు. చింతలపేటలో ఇద్దరిపై దాడి జరిగిన నేపథ్యంలో మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నియంత్రించి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు.

Also Read : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర దాడికి భారీ కుట్ర

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>