వృషకర్మ ట్రైలర్ లాంచ్ కౌంట్‌డౌన్ షురూ!

కలం, సినిమా: ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వృషకర్మ’ (Vrushakarma) సినిమా ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు సాయంత్రం 5 గంటల నుండి నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో హీరోగా నాగ చైతన్య, హీరోయిన్‌గా దక్ష పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తుండగా, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు.

సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తుండగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త ప్రపంచంలోకి ఈ సినిమా తీసుకెళ్లనుందని మేకర్స్ అంచనాలను పెంచుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>