కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణ హత్య చోటు చేసుకుంది. ఎంఐఎం నాయకుడు ముర్తుజా అలీ (Murtuza Ali)ని ప్రత్యర్థులు చంపేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సుమారు పది మంది వ్యక్తులు ఆయనపై హిమాయత్ సాగర్ ఈవో పార్క్ వద్ద విచక్షణరహితంగా కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో ఉన్న ముర్తుజా అలీని ఆసుపత్రికి తరలించేలోపే తీవ్ర గాయాలతో మరణించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, ఈ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని తెలుస్తోంది. ముర్తుజా అలీ మాజీ రౌడీ షీటర్ కావడంతో ఆ కోణంలో విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

