అబుదాబి ఓపెన్ 2027లో అలెగ్జాండ్రా ఈలా

క‌లం, స్పోర్ట్స్: టెన్నిస్‌లో దూసుకుపోతున్న ఫిలిప్పీన్స్ స్టార్ అలెగ్జాండ్రా ఈలా (Alexandra Eala) మరోసారి అబుదాబి టోర్నీకి సిద్ధమైంది. 2027లో జరిగే ముబాదాలా అబుదాబి ఓపెన్‌లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో ఆమె ఆడటం ఇది మూడోసారి. 21 ఏళ్ల ఈలా ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉంది. డబ్ల్యూటీఏ చరిత్రలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఫిలిప్పీన్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2025లో 140వ ర్యాంకులో ఉన్న ఆమె.. అద్భుత ప్రదర్శనతో 15వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ఆమె కెరీర్‌లో కీలక విజయాలు సాధించింది.

వాషింగ్టన్‌లో తన తొలి డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. వింబుల్డన్‌లో తొలిసారి నాలుగో రౌండ్‌కు చేరి గ్రాండ్‌స్లామ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2024, 2026లోనూ అబుదాబి ఓపెన్‌లో పాల్గొన్న ఈలా.. మూడోసారి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. యూఏఈలోని ఫిలిప్పీన్స్ అభిమానుల నుంచి లభించే మద్దతు తనకు ప్రత్యేకమని పేర్కొంది. ముబాదాలా అబుదాబి ఓపెన్ ఐదో ఎడిషన్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. జాయెద్ స్పోర్ట్స్ సిటీలోని ఇంటర్నేషనల్ టెన్నిస్ సెంటర్ ఈ పోటీలకు వేదిక కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>