కలం, పాల్వంచ: ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీలో ఆశా కార్యకర్తలకు (ASHA Workers) ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ పలువురు ఆశా వర్కర్లు సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గత పదేళ్లుగా తాము ఆశా వర్కర్లుగా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నప్పటికీ, ఉద్యోగ పరంగా ఎలాంటి ఎదుగుదల లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశా కార్యకర్తలలో డిగ్రీ వంటి ఉన్నత చదువులు పూర్తి చేసిన వారు, సుదీర్ఘ సీనియారిటీ కలిగిన వారు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు. కనీసం అర్హత, సీనియారిటీ ఉన్న వారికైనా ఏఎన్ఎం నియామకాల్లో ప్రత్యేక అవకాశం కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నట్లు తెలిపారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, తదుపరి చర్యల నిమిత్తం ఆ దరఖాస్తును సంబంధిత శాఖాధికారులకు ఎండార్స్ (సిఫార్సు) చేశారని ఆశా వర్కర్లు వెల్లడించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆశా కార్యకర్తలు కావేరి, అరుణ, లత, గంగ, రామ్ సీత తదితరులు ఉన్నారు.

