కృష్ణా నీళ్ల వివాదం.. ఏపీ, తెలంగాణ ఏమన్నాయంటే!

కలం, వెబ్ డెస్క్: ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న కృష్ణా నీళ్ల వివాదంపై చర్చించేందుకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం (KRMB Meeting)  వాడీవేడిగా సాగింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీలు రమేశ్ బాబు, నరసింహమూర్తి హాజరయ్యారు. నాగార్జున సాగర్ జలాల విషయంలో ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది.

ఏపీ ప్రభుత్వం తమకు 19 టీఎంసీల నీరు అవసరమని ప్రతిపాదించగా.. తెలంగాణ వచ్చే ఫిబ్రవరి వరకు 21 టీఎంసీలు కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీకి పది చుక్కలు కూడా ఇవ్వలేమని తెలంగాణ ఈఎన్సీ తేల్చి చెప్పారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో ఏపీకి 42 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని.. కృష్ణా డెల్టాకు కూడా నీరు అందుతోందన్నారు.

హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసమే..

హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 25 టీఎంసీలు అవసరమవుతాయని తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు ఉందన్నారు. 25 టీఎంసీలు తాగునీటికి పోను, మరో అయిదు టీఎంసీలు ఆవిరి కింద లెక్కిస్తే.. మిగిలేవి పది టీఎంసీలే అన్నారు. రెండు కాల్వల కింద తాగునీటి అవసరాలకు అవి పూర్తి స్థాయిలో సరిపోవన్నారు. అందుకే, ఏపీకి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మరోవైపు, పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అంశంపై సమావేశంలో తెలంగాణ ప్రస్తావించగా.. దానిపై తమ వద్ద పూర్తి సమాచారం లేదని ఏపీ ఈఎన్సీ ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>