చేనేత పెన్షన్ల మంజూరులో అన్యాయం.. పద్మశాలీల ధర్నా

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో చేనేత కార్మికుల (Padmashali Weavers) పెన్షన్ల మంజూరులో అర్హులైన పద్మశాలి కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ పద్మశాలీలు ఆందోళనకు దిగారు. అర్హత ఉన్నప్పటికీ పలువురు చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. పొట్టవత్తిని సతీష్ న్యాయవాది, కన్నాపూర్ సర్పంచ్ నాయకత్వంలో వందలాది మంది పద్మశాలి కులబాంధవులు ఈ నిరసనలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికీ పెన్షన్ ఇవ్వాలి..

సంఘం నాయకులు మాట్లాడుతూ.. చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులకు పెన్షన్లు ఎంతో ఆసరాగా ఉంటాయని, అలాంటి పథకం అమలులో అర్హులకు అన్యాయం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షన్ల మంజూరులో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దాలని, అర్హులైన పద్మశాలి చేనేత కార్మికులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి అర్హులందరికీ న్యాయం చేయాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్పల్లి సుధాకర్, జగిత్యాల మాజీ పట్టణ అధ్యక్షుడు భోగ గంగాధర్, అనుమల్ల జయశ్రీ, జిల్లా నాయకులు ధనుజయ్, పొట్టవత్తిని చక్రపాణి తదితరులతో పాటు జిల్లా, పట్టణ నాయకులు, జిల్లాలోని మిగతా మండల, గ్రామ అధ్యక్షులు, పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>