కలం, ఆదిలాబాద్: ఈ నెల 26న నిర్వహించనున్న 77వ భారత రాజ్యాంగ దినోత్సవ(77th Constitution Day) వేడుకల పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.
మాల, మాదిగ, నేతకాని, అనుబంధ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 26న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌక్ వద్ద వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్ ఆర్.ఎస్. చిత్రు, జేఏసీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

