ఇందిరమ్మ బీమాతో పాటు రైతు బీమాను కొనసాగించాలి: అనిల్ జాదవ్

కలం, ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో అర్హులైన ఒక్కరూ కూడా నష్టపోకూడదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Anil Jadhav) అన్నారు. సోమవారం తలమడుగు మండలం చర్లపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ యజమానుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. గ్రామంలో అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా బీమా పథకానికి దూరం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుటుంబానికి అండగా నిలిచే బీమా పథకంతో పాటు రైతులకు భరోసా కల్పించే రైతు బీమా పథకాన్ని కూడా ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో అమలులో ఉన్న రైతు బీమాను నిలిపివేయకుండా కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>