కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఆ రాష్ట్ర సీఎం విజయ్, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకే దగ్గర కనిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ (Anirudh-Kavya Reception) చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. రిసెప్షన్ లో సీఎం విజయ్, స్టాలిన్, రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వేడుకకు హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేరుగా స్టాలిన్, రజనీకాంత్ దగ్గరకు వెళ్లారు. వారిని ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి వస్తానని వారికి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సీఎం హోదాలో ఉన్నా కూడా విజయ్ సింప్లిసిటీగా నడుచుకోవడంపై ప్రశంసలు వస్తున్నాయి.
కాగా, నవంబర్ 11న గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ జంట వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు మారన్, అనిరుధ్ కుటుంబ సభ్యులతో పాటు రజనీకాంత్, ఎంకే స్టాలిన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా, శనివారం చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ (Anirudh-Kavya Reception) ఏర్పాటు చేశారు.

