సీపీఐ బలోపేతానికి సభ్యత్వ నమోదు కీలకం: చాడ వెంకటరెడ్డి

కలం, కరీంనగర్: గ్రామ స్థాయి నుంచి సీపీఐని మరింత బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు చాలా కీలకమని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ అధ్యక్షతన జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలు చేయాలంటే సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలు గాలికొదిలేసి కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడి దారులకు ఊడిగం చేస్తోందన్నారు.

అదానీ, అంబానీల ఆస్తులు పెరిగిపోతున్నాయని.. పేదల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి నిధులు ఇవ్వడం లేదన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, న్యాలపట్ల రాజు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>