కల్తీ కల్లు ముఠా గుట్టు రట్టు.. 56 కిలోల క్లోరల్ హైడ్రేట్ పట్టివేత!

క‌లం , మెద‌క్ బ్యూరో : కల్తీ కల్లు తయారీకి వినియోగించే 56 కేజీల క్లోరో హైడ్రేడ్ (Chloral Hydrate) ను మెదక్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం స్వాధీనం చేసుకుంది. పక్కా సమాచారంతో జాతీయ రహదారి-161, 165 పై నిఘా పెట్టిన అధికారులు, సంగారెడ్డి జిల్లా కంది గ్రామం వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు మారుతి కారులో అక్రమంగా సీహెచ్ తరలిస్తుండగా పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. కారులో 28 కిలోల చొప్పున ఉన్న రెండు బస్తాల క్లోరల్ హైడ్రేట్‌ లభ్యమైంది. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ. 2.80 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

దీంతో కారులో ఉన్న ఉమా కాంత్ గౌడ్ (28)ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తన బావ అయిన తిప్పారం వెంకట్ గౌడ్ (40) ఆదేశాల మేరకే తాను ఈ సరుకును హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. కాగా, వెంకట్ గౌడ్ గత కొంతకాలంగా సీహెచ్, అల్ప్రాజోలం అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఉమాకాంత్‌తో పాటు ప్రధాన నిందితుడు వెంకట్ గౌడ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.

ఘటనలో 56 కిలోల క్లోరల్ హైడ్రేట్‌తో పాటు అక్రమ రవాణాకు వినియోగించిన మారుతి కారును కూడా సీజ్ చేశామని సీఐ తెలిపారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాల రవాణాను అరికట్టాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులను ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>