అచ్చంపేటలో గంజాయి పట్టివేత

కలం, అచ్చంపేట: అచ్చంపేట (Achampet) పట్టణంలో 7.5 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని శ్రీశైలం ప్రధాన రహదారిలో వై జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి తాగుతున్నారనే సమాచారంతో వారిని పట్టుకుని విచారించారు. మరో తొమ్మిది మంది విక్రయిస్తున్నట్లు గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు, ఆకతాయిలు, అజ్ఞాత వ్యక్తులు కాలనీలు, పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటే సమాచారం ఇవ్వాలని ఎస్సై నరేష్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>