ఈ కామ‌ర్స్ వ్యాపారికి ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగుల కుచ్చుటోపి!

క‌లం, వెబ్‌డెస్క్‌: కంచే చేను మేసినట్లుగా సరుకును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన ఫ్లిప్‌కార్ట్ సిబ్బందే (Flipkart Employees) మార్గమధ్యలో కొత్త షూస్‌ను కాజేసి వాటి స్థానంలో పాత చెప్పులు పెట్టి రిటర్న్ రూపంలో పంపి వ్యాపారిని నిండా ముంచారు. ఆగ్రాలో జరిగిన ఈ ఘటన ఆన్‌లైన్ వ్యాపారుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఓ ఫ్లిప్‌కార్ట్ సెల్ల‌ర్ దారుణంగా మోసపోయారు. ఆయ‌న వ‌ద్ద‌ ఏకంగా 550 షూ బాక్సులు కొనుగోలు చేసి రిట‌ర్న్‌లో పాత చెప్పులు, షూస్ పెట్టి పంపించారు. మోహన్‌పురాకు చెందిన గౌరవ్ గుప్తా ఈ కామ‌ర్స్ బిజినెస్ చేస్తుంటారు. ఆయ‌న‌ ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్, నవ్య ఇంటర్నేషనల్ సంస్థల నుంచి నవంబర్ 16న 550 షూ బాక్సుల‌ను పంపించారు.

ట్రాన్స్ పోర్ట్ వ్య‌వ‌హారాలు చూసుకుంటున్న రామ్‌సేవక్, దేవేష్ బాబు అనే ఉద్యోగులు సరుకును వాహనంలో తరలించారు. అయితే మార్గమధ్య‌లోనే వీరు షూ బాక్సులను తెరిచి కొత్త వాటిని తీసేసి పాతవి పెట్టినట్లు గౌర‌వ్ గుప్తా ఆరోపిస్తున్నారు. వేర్‌హౌస్‌కు చేరాక తనిఖీ చేయగా ఈ మోసం బయటప‌డింది. దీంతో ఈ-కామర్స్ సెల్లర్స్ అసోసియేషన్ డయల్ 112 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సరుకును, వాహనాన్ని పరిశీలించారు. సదరు ఇద్దరు ఉద్యోగులు (Flipkart Employees) పరారీలో ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో రామ్‌నివాస్, పుష్పేంద్ర కుమార్ అనే మరో ఇద్దరు సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరపాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఫ్లిప్‌కార్ట్ ఆగ్రా హబ్ అధికారులు పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నించారు. నిష్పక్షపాత విచారణ కోసం హబ్‌లోని సీసీటీవీ ఫుటేజీని, పికప్-డెలివరీ రికార్డులను, వాహనం ప్రయాణించిన మార్గ వివరాలను పరిశీలించాలని కోరారు. చిన్న వ్యాపారికి భారీ ఆర్థిక నష్టం కలిగించేలా జరిగిన ఈ మోసంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలైన కొత్త షూస్‌ను రికవరీ చేయడంతో పాటు, స‌రుకు ర‌వాణా సమయంలో భద్రతా లోపాలు, బాక్సుల సీలింగ్ స్థితిగతులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విచారణలో వెల్లడయ్యే ఆధారాలను బట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు.

Also Read : ధోనీ నిర్ణ‌యం షాక్‌కు గురి చేసింది: జహీర్ ఖాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>