కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో డిసెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్ (Lok Adalat) ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో శనివారం జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నిర్మల్, భైంసా, ఖానాపూర్ న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ చేసుకునే విధంగా కక్షిధారులు మధ్యవర్తిత్తం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో పలు రకాల కేసుల పరిష్కారం కోసం అవకాశం ఉంటుందని, ఈ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : విజృంభించిన బ్యాటర్లు.. భారత్కు భారీ ఆధిక్యం
Follow Us On : WhatsApp

