కలం, స్పోర్ట్స్: 19 సీజన్ల ఐపీఎల్ ప్రయాణానికి ఎంఎస్ ధోనీ (MS Dhoni) తెరదించడంతో సీఎస్కే అభిమానుల్లో భావోద్వేగాలు నెలకొన్నాయి. ఆటగాడిగా తప్పుకుని జట్టు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్న ధోనీ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని హెడ్ కోచ్ జహీర్ ఖాన్ (Zaheer Khan) వెల్లడించారు. ఈ విషయాన్ని ధోనీ చాలా సింపుల్‌గా చెప్పాడని గుర్తుచేసుకున్నారు. ఐపీఎల్ 2027 రిటెన్షన్‌కు ముందు ధోనీ ఆటగాడిగా కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడు. ఇకపై సీఎస్కే మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నిర్ణయం ఊహించలేదని, ధోనీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని జహీర్ పేర్కొన్నాడు. ధోనీ ఆటగాడిగా జట్టులో కనిపించకపోయినా, మరో రూపంలో తన పాత్ర కొనసాగించనున్నాడు.
అతడి అనుభవం, నాయకత్వం జట్టుకు ఉపయోగపడతాయని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోనీ(MS Dhoni)తో కలిసి పనిచేయడం తన బాధ్యతలను సులభతరం చేస్తుందని తెలిపాడు. ధోనీ నాయకత్వంలో ప్రధానమైనది ఆటగాళ్లపై నమ్మకమని జహీర్ వివరించాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూ, ఫలితం ఆశించిన విధంగా రాకపోతే అవసరమైన సమయంలో జోక్యం చేసుకోవడం ధోనీ ప్రత్యేకత అని పేర్కొన్నాడు. జట్టును ఒకే దిశలో నడిపించేందుకు ఇద్దరూ కలిసి పనిచేస్తామని తెలిపాడు. ధోనీ, జహీర్ గతంలో భారత జట్టులో సహచరులుగా ఆడారు. ఇప్పుడు సీఎస్కేలో కోచ్, మెంటార్‌గా కలిసి కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read : ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ భారీ విరాళం
Follow Us On: Youtube

