ఖానాపూర్‌లో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు

కలం, ఖానాపూర్: ఖానాపూర్ (Khanapur) పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. కళ్యాణ క్రతువును తిలకించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>