కలం, వెబ్ డెస్క్ : జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ షూటర్స్ (Telangana Shooters) అదరగొట్టారు. ఈ విషయాన్ని తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రకటించింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశవ్యాప్తంగా ముప్పై వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. సబ్ యూత్, యూత్ సీనియర్, మాస్టర్ సీనియర్, మాస్టర్ సూపర్, మాస్టర్ విభాగాల్లో పురుషులు మహిళలు పోటీ పడ్డారు.
తెలంగాణ షూటర్లు (Telangana Shooters) మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. నాలుగు బంగారు, ఒక వెండి, మూడు కాంస్య పతకాలు అందుకున్నారు. షాట్ గన్ విభాగంలో మూడు బంగారు పతకాలు లభించగా రైఫిల్ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి, మూడు కాంస్య పతకాలు వచ్చాయి. ఇది తెలంగాణ షూటింగ్ ప్రతిభలో డెప్త్‌ను స్పష్టంగా చూపించింది.
షాట్ గన్ పోటీల్లో తెలంగాణ షూటర్లు విశేష ప్రదర్శన కనబరిచారు. N-84 క్లే పిజన్ స్కీట్ షూటింగ్ ఐఎస్ఎస్ఎఫ్ సీనియర్ మాస్టర్ మెన్ వ్యక్తిగత విభాగంలో గుస్తి నోరియా బంగారు పతకం సాధించారు. N-72 క్లే పిజన్ ట్రాప్ షూటింగ్ ఐఎస్ఎస్ఎఫ్ సీనియర్ మాస్టర్ మెన్ వ్యక్తిగత విభాగంలో డారియస్ చెనై బంగారు పతకం గెలుచుకున్నారు. N-97 స్కీట్ మిక్స్ డ్ జూనియర్ టీమ్ ఐఎస్ఎస్ఎఫ్ జాతీయ చాంపియన్ షిప్ లో యువెక్ బట్టుల్లా, వెంకట లక్ష్మి లక్కు బంగారు పతకం సాధించి తెలంగాణ జూనియర్ బృందానికి గొప్ప విజయాన్ని అందించారు. N-92 క్లే పిజన్ స్కీట్ షూటింగ్ ఐఎస్ఎస్ఎఫ్ మాస్టర్ మెన్ వ్యక్తిగత విభాగంలో ఈ చెతన్ రెడ్డి కాంస్య పతకం సాధించారు.
రైఫిల్ విభాగంలో మొహమ్మద్ అబ్దుల్ ఖలీక్ తెలంగాణ తరఫున టాప్ విన్నర్‌గా నిలిచారు. NM-14 యాభై మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ మెన్ ఐఎస్ఎస్ఎఫ్ సివిలియన్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించారు. NM-13 యాభై మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ మెన్ ఐఎస్ఎస్ఎఫ్ జాతీయ చాంపియన్ షిప్ లో ఖాన్, ముస్తఫా ఖాన్, రోహిత్ కవిటి సహకారంతో కాంస్య పతకం సాధించారు. NM-9 యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ జూనియర్ మహిళల ఐఎస్ఎస్ఎఫ్ సివిలియన్ చాంపియన్ షిప్ లో చెన్నుపల్లి ప్రణతి, రాజా సాగి శ్రీ అపూర్వ, ధవలిక దేవి న్యామూర్స్ వెండి పతకం గెలుచుకున్నారు. రోహిత్ కవిటి.. NM-4 యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ జూనియర్ మెన్ ఐఎస్ఎస్ఎఫ్ సివిలియన్ చాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించారు.
పతక విజేతలను పాల్గొన్న క్రీడాకారులను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ ఆర్ ఏ ఐ సీనియర్ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమిత్ సంగీ అభినందించారు. క్రీడాకారుల క్రమశిక్షణ నిబద్ధత పట్టుదలను ఆయన ప్రశంసించారు. ఈ పతక విజయాలు తెలంగాణలో బలమైన శిక్షణ వ్యవస్థను షూటింగ్ క్రీడల్లో పెరుగుతున్న స్థాయిని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.
అరవై ఎనిమిదవ జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ 2025ను విజయవంతంగా నిర్వహించిన ఎన్ ఆర్ ఏ ఐకు తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే షూటర్లను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రతిభా పెంపకానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. తెలంగాణ షూటర్ల విజయాలు రాబోయే తరం క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తున్నాయని మీడియా ఈ విజయాలను ప్రోత్సహించాలని అసోసియేషన్ కోరింది.
-84 క్లే పిజన్ స్కీట్ షూటింగ్ ఐఎస్ ఎస్ ఎఫ్ జాతీయ చాంపియన్ షిప్
సీనియర్ మాస్టర్ పురుషుల వ్యక్తిగత విభాగం
1 గుస్తి నోరియా టీఆర్ఏ 99 41 బంగారు పతకం
2 గిరిస్త్ పుంజా కర్ణాటక 97 39 వెండి పతకం
3 రాజగోపాల్ తొండైమన్ తమిళనాడు 92 33 కాంస్య పతకం
N-92 క్లే పిజన్ స్కీట్ షూటింగ్ ఐఎస్ ఎస్ ఎఫ్
మాస్టర్ పురుషుల వ్యక్తిగత విభాగం
1 సరోష్ ఖాన్ రాజస్థాన్ 98 44 బంగారు పతకం
2 సయ్యద్ హమ్మద్ మీర్ ఢిల్లీ 106 41 వెండి పతకం
3 ఈ చెతన్ రెడ్డి టీఆర్ఏ 105 34 కాంస్య పతకం
N-97 స్కీట్ మిక్స్ డ్ జూనియర్ టీమ్ ఐఎస్ ఎస్ ఎఫ్
జాతీయ చాంపియన్ షిప్
1 యువెక్ బట్టుల్లా టీఆర్ఏ 68.0
వెంకట లక్ష్మి లక్కు 73.0
మొత్తం 141 బంగారు పతకం
2 వంశిక మధ్యప్రదేశ్ 71.0
జ్యోతిరాదిత్య సింగ్ 69.0
మొత్తం 140 వెండి పతకం
3 పరమీట్ కౌర్ రాజస్థాన్ 63.0
హర్మెహర్ సింగ్ లల్లి 73.0
మొత్తం 136 కాంస్య పతకం
N-72 క్లే పిజన్ ట్రాప్ షూటింగ్ ఐఎస్ ఎస్ ఎఫ్
జాతీయ సీనియర్ మాస్టర్ పురుషుల వ్యక్తిగత విభాగం
1 డారియస్ చెనై టీఆర్ఏ 94 36 బంగారు పతకం
2 డా పార్థిబన్ మనోహరన్ తమిళనాడు 100 33 వెండి పతకం
3 ఇక్బాల్ నబీ ఉత్తరప్రదేశ్ 92 29 కాంస్య పతకం
NM-13 యాభై మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ పురుషులు ఐఎస్ ఎస్ ఎఫ్
జాతీయ చాంపియన్ షిప్
1 వేదాంత్ నితిన్ వాఘ్మారే మహారాష్ట్ర 623.0
కృష్ణ వికాస్ షెల్కే 617.2
గౌరవ్ దినేశ్ దేశ్లే 615.6
మొత్తం 1855.8 బంగారు పతకం
2 మాన్వేంద్ర సింగ్ రాజస్థాన్ 620.8
దీపేంద్ర సింగ్ 613.7
హర్ష్ వర్ధన్ శర్మ 611.5
మొత్తం 1846.0 వెండి పతకం
3 మొహమ్మద్ అబ్దుల్ ఖలీక్ టీఆర్ఏ 616.1
ఖాన్ ముస్తఫా ఖాన్
రోహిత్ కవిటి 616.1
అద్నాన్ ఖుస్రోవే 608.4
మొత్తం 1840.6 కాంస్య పతకం
NM-14 యాభై మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ పురుషులు ఐఎస్ ఎస్ ఎఫ్
సివిలియన్ చాంపియన్ షిప్
1 మొహమ్మద్ అబ్దుల్ ఖలీక్ టీఆర్ఏ 616.1
ఖాన్ ముస్తఫా ఖాన్
రోహిత్ కవిటి 616.1
రయాన్ ఫైసల్ యూసుఫుద్దీన్ 608.2
మొత్తం 1840.4 బంగారు పతకం
2 మాన్వేంద్ర సింగ్ శేఖావత్ రాజస్థాన్ 620.8
హర్ష్ వర్ధన్ శర్మ 611.5
ప్రిన్స్ 606.2
మొత్తం 1838.5 వెండి పతకం
3 దేవాంశ్ మౌద్గిల్ హిమాచల్ ప్రదేశ్ 620.2
ఫర్హాన్ మిర్జా 611.6
సోమిల్ నేగి 601.1
మొత్తం 1832.9 కాంస్య పతకం
NM-09 యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ జూనియర్ మహిళలు ఐఎస్ ఎస్ ఎఫ్
సివిలియన్ చాంపియన్ షిప్
1 శ్రీవల్లి శ్రీవాస్తవ మధ్యప్రదేశ్ 583.0-27ఎక్స్
అర్చనా దమాహే 578.0-20ఎక్స్
ప్రథా రాథోడ్ 576.0-25ఎక్స్
మొత్తం 1737.0-72ఎక్స్ బంగారు పతకం
2 చెన్నుపల్లి ప్రణతి టీఆర్ఏ 579.0-19ఎక్స్
రాజా సాగి శ్రీ అపూర్వ 578.0-23ఎక్స్
ధవలిక దేవి న్యామూర్స్ 571.0-25ఎక్స్
మొత్తం 1728.0-67ఎక్స్ వెండి పతకం
3 శరణ్య లక్షణ్ మధ్యప్రదేశ్ 579.0-26ఎక్స్
యుగేశ్వరి బైస్ 573.0-23ఎక్స్
ప్రార్థనా సేన్ 569.0-16ఎక్స్
మొత్తం 1721.0-65ఎక్స్ కాంస్య పతకం
NM-04 యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ జూనియర్ పురుషులు ఐఎస్ ఎస్ ఎఫ్
సివిలియన్ చాంపియన్ షిప్
1 ఎస్ హితేష్ తమిళనాడు 583-29ఎక్స్ బంగారు పతకం
2 గౌరవ్ దినేశ్ మహారాష్ట్ర 583-24ఎక్స్ వెండి పతకం
3 రోహిత్ కవిటి టీఆర్ఏ 580-27ఎక్స్ కాంస్య పతకం
Read Also: మిల్కాసింగ్.. 15 ఏళ్లకే ఇండియా నెం.1
Follow Us On: Sharechat


