ఈవీఎం, బ్యాలెట్..​ ఎన్నికేదైనా కూటమిదే విజయం : చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్​: 2024 ఎన్నికల కంటే కూటమి బలపడిందని పరిషత్​ ఎన్నికల ఫలితాలు ధృవీకరిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తెలిపారు. ఈ ఫలితాలు రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన గుర్తింపు అని.. పరిషత్​ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఉత్తమమైన విధానం పాటించినట్లు తెలిపారు.

ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తరువాతే మంచి విద్యార్హతలు ఉన్నవారికే టికెట్లు ఇచ్చినట్లు చంద్రబాబు (Chandrababu) వెల్లడించారు. జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు, సీనియర్లతో మాట్లాడి జాబితా రూపొందించినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి 94శాతం స్ట్రయిక్ రేట్ వస్తే జిల్లా పరిషత్ ఎన్నికల్లో 96.42 శాతం స్ట్రయిక్ రేటు వచ్చిందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>