కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మాతృమూర్తి సావిత్రి దేవి అంతిమయాత్ర ఉత్తరాఖండ్లో భావోద్వేగ వాతావరణంలో సాగింది. తన తల్లి పార్థివ దేహానికి స్వయంగా పాడె మోస్తూ యోగి ఆదిత్యనాథ్ తుది వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో కన్నతల్లిని కోల్పోయిన దుఃఖాన్ని ఆపుకోలేక ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. సావిత్రి దేవి పార్థివ దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం చండీ ఘాట్ శ్మశానవాటికకు తరలించారు.
ముఖ్యమంత్రిగా ఎంతో దృఢంగా కనిపించే యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), ఒక కొడుకుగా తన తల్లి మరణంతో కొండంత దుఃఖంలో మునిగిపోయారు. మాతృవియోగంతో ఆయన కన్నీరుమున్నీరవ్వడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
యోగి భావోద్వేగ ట్వీట్..
తల్లి ప్రేమ, ఆప్యాయతల గొప్పదనాన్ని వివరిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. ఈ లోకంలో తల్లి నీడకు మించిన నీడ, తల్లి ఆశ్రయానికి మించిన ఆశ్రయం మరొకటి లేదని ఆయన పేర్కొన్నారు. బిడ్డకు తల్లి కల్పించే రక్షణకు, చూపే ప్రేమకు ఏదీ సాటిరాదని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Also Read : ఉసిరికాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తింటే కలిగే లాభాలు ఇవే!
Follow Us On : WhatsApp

